11వ ర్యాంక్‌లో మురళీ విజయ్ | Ranked 11 Murali Vijay | Sakshi
Sakshi News home page

11వ ర్యాంక్‌లో మురళీ విజయ్

Nov 11 2015 12:18 AM | Updated on Sep 3 2017 12:20 PM

11వ ర్యాంక్‌లో మురళీ విజయ్

11వ ర్యాంక్‌లో మురళీ విజయ్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ మురళీ విజయ్...

దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ మురళీ విజయ్... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు పురోగతి సాధించాడు. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో మురళీ విజయ్ 11వ స్థానంలో నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్‌దే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.

దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.  బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ అశ్విన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకోగా... జడేజా 21వ స్థానంలో నిలిచాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement