ఆమెతో వీలైతే కాఫీ.. కుదిరితే డేట్‌ | Raina Wants Coffee With Shardul CSK Shares Gender Swap Photo | Sakshi
Sakshi News home page

ఆమెతో కాఫీకి వెళతా కుదిరితే డేట్‌కు కూడా

Jun 25 2020 3:55 PM | Updated on Jun 25 2020 4:14 PM

Raina Wants Coffee With Shardul CSK Shares Gender Swap Photo - Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జెండర్‌ స్వాప్‌ ఫోటోల ట్రెండ్‌ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు జెండర్‌ స్వాప్‌ ఫోటో యాప్‌ తెగ అలరిస్తోంది. మగవారు ఆడవారిగా ఆడవారు మగవారిగా మారితో ఎలా ఉంటారో ఈ యాప్‌ చూపిస్తుంది. టీమిండియా క్రికెటర్లు ఈ యాప్‌ను తెగ ఇష్టపడుతున్నారు. ఇప్పటికే తమ సహచర క్రికెటర్ల జెండర్‌ స్వాప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఫన్నీ క్యాప్షన్స్‌ను జతచేస్తున్నారు. ఇప్పటికే యజ్వేంద్ర చహల్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (నేనైతే ఆమెతో డేట్‌కు వెళతా: దాదా)

తాజాగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ జట్టు ఆటగాళ్లకు సంబంధించి జెండర్‌ స్వాప్‌ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. అంతేకాకుండా ‘మీపై ప్రేమతో చెన్నై సూపర్‌ క్వీన్స్‌’అంటూ క్యాప్షన్‌ జతచేసింది. సీఎస్‌కే షేర్‌ చేసిన ఫోటోల్లో ధోని, రైనా, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, డుప్లెసిస్‌, దీపక్‌ చహర్‌, సాంట్నర్‌, ఎంగిడి, బ్రావోలు ఉన్నారు. ఇక ఈ సీఎస్‌కే చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సీఎస్‌కే పోస్ట్‌పై స్పందించిన రైనా ‘హహహ.. నేను, శార్దూల్‌ త్వరలోనే కాఫీకి వెళతాం’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక చాలా మంది నెటిజన్లు మాత్రం దీపక్‌ చహర్‌కు ఓటేశారు. హెయిర్‌ స్టైల్‌, లిప్‌స్టిక్‌ ఇలా అన్ని దీపక్‌కు చక్కగా కుదిరాయని, కుదిరితే ఆమెతో డేట్‌కు వెళతామని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు. (రోహిత్‌ను అమ్మాయిగా మార్చేశాడు..!)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement