స్టోక్స్‌ను ఆరేసిన రైనా | Raina punishes Ben Stokes | Sakshi
Sakshi News home page

స్టోక్స్‌ను ఆరేసిన రైనా

Apr 20 2018 8:46 PM | Updated on Apr 20 2018 9:37 PM

Raina punishes Ben Stokes - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో గత మ్యాచ్‌కు దూరమై తిరిగి జట్టులో చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తాజా మ్యాచ్‌లో దూకుడును ప్రదర్శించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రైనా వరుస ఫోర్లతో అదరగొట్టాడు.  ప్రధానంగా బెన్‌ స్టోక్స్‌ వేసిన ఆరో ఓవర్‌లో రైనా రెచ్చిపోయి ఆడాడు. వరుస నాలుగు బంతుల్ని బౌండరీలకు తరలించి సత్తాచాటాడు.

ఆరో ఓవర్‌ మూడు, నాలుగు బంతుల్ని ఫైన్‌ లెగ్‌ మీదుగా బౌండరీలు బాదిన రైనా.. ఐదో బంతిని స్లిప్‌ నుంచి ఫోర్‌ సాధించాడు. ఇక ఆరో బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఫోర్‌ కొట్టాడు. దాంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 69 పరుగులు సాధించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement