
మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్గించాడు. భారత స్కోరు 46.4 ఓవర్లలో 305/4 వద్ద ఉండగా వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆట నిలిచే సమయానికి కోహ్లి(71 బ్యాటింగ్), విజయ్ శంకర్(3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్ తిరిగి ఆరంభం కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యమైన పక్షంలో ఓవర్లను కుదించే అవకాశాలు కనబడుతున్నాయి.