రాహుల్‌కు రజతం 

Rahul Gets Silver Medal In RSPB - Sakshi

కోల్‌కతా: జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట్‌ రాహుల్‌ రజత పతకం సాధించాడు. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన రాహుల్‌... జాతీయ చాంపియన్‌షిప్‌లో 89 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. 

గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్‌ మొత్తం 323 కేజీలు (స్నాచ్‌లో 144+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 179) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. సాంపో లాపుంగ్‌ (సర్వీ సెస్‌) 333 కేజీలు బరువెత్తి స్వర్ణం నెగ్గగా... రామ్‌కరణ్‌ ప్రజాపతి (ఉత్తరాఖండ్‌) 314 కేజీలతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top