శుభమ్‌ శర్మపై రాహిమి గెలుపు | Rahimi beats Subham Sharma in Telangana Boxing League | Sakshi
Sakshi News home page

శుభమ్‌ శర్మపై రాహిమి గెలుపు

Feb 5 2019 10:06 AM | Updated on Feb 5 2019 10:06 AM

Rahimi beats Subham Sharma in Telangana Boxing League - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ లీగ్‌లో భారత బాక్సర్‌ శుభమ్‌ శర్మకు నిరాశ తప్పలేదు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సోమవారం హోరాహోరీగా జరిగిన బౌట్‌లో అఫ్గానిస్తాన్‌ బాక్సర్‌ అల్లాహ్‌దాద్‌ రాహిమి విజేతగా నిలిచాడు. బౌట్‌ ఆసాంతం అద్భుతంగా పోరాడిన శుభమ్‌ చివర్లో రాహిమి ముందు తలవంచాడు. వీరిద్దరూ టైటిల్‌ కోసం 40 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు.

ప్రతీ దశలోనూ ఇరువురు సమానంగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి అదనంగా మరో రెండు రౌండ్ల పాటు బౌట్‌ను కొనసాగించారు. అప్పటికే అలసిపోయిన శుభమ్‌ చివర్లో ఓడిపోక తప్పలేదు. ఇతర బౌట్‌లలో దక్షిణాఫ్రికాకు చెందిన రికర్డో హీరామన్‌ను గురుప్రీత్‌ సింగ్‌ నాకౌట్‌ చేశాడు. హర్ష్‌ పురోహిత్‌పై సపర్బాయ్‌ ఐదరోవ్‌ (కజకిస్తాన్‌) గెలిచాడు.     మహిళల విభాగంలో అనిత మౌర్యపై రమణ్‌దీప్‌ కౌర్‌ కష్టంగా గెలవగా... అనహిత్‌ అరియా (అర్మేనియా) చేతిలో కమలా రోకా పరాజయం చవిచూసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement