ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత రఫెల్‌ నాదల్‌ | Rafael Nadal defeats Stan Wawrinka to win 10th French Open | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత రఫెల్‌ నాదల్‌

Jun 11 2017 9:14 PM | Updated on Sep 5 2017 1:22 PM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత రఫెల్‌ నాదల్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత రఫెల్‌ నాదల్‌

మట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి విజృంభించాడు

పారిస్‌: మట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో వావ్రింకాపై విజయం సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.

ఏకపక్షంగా జరిగిన ఫైనల్‌లో వావ్రికాను 6-2, 6-3, 6-1 తేడాతో నాదల్‌ మట్టికరిపించాడు. ఈ విజయంతో 10 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా నాదల్‌ రికార్డు సృష్టించాడు. అలాగే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాదల్‌ రెండోస్థానంలో నిలిచాడు. మొత్తంగా నాదల్‌కు ఇది 15వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కాగా.. ఫెదరర్‌ 18 గ్రాండ్‌స్లామ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన నాదల్‌ కేవలం 35 గేమ్‌లను మాత్రమే కోల్పోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement