క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్‌ | Quarters in Vikas, Gaurav | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్‌

May 2 2017 12:38 AM | Updated on Sep 5 2017 10:08 AM

క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్‌

క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్‌

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), గౌరవ్‌ బిధూరి (56 కేజీలు), అమిత్‌

తాష్కెంట్‌: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), గౌరవ్‌ బిధూరి (56 కేజీలు), అమిత్‌ ఫంగల్‌ (49 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పతోమసక్‌ కుటియా (థాయ్‌లాండ్‌)తో జరిగిన బౌట్‌లో వికాస్‌ రెండు నిమిషాల్లోపే విజయం సాధించాడు.

గౌరవ్‌ బిధూరి పాయింట్ల ప్రాతిపదికన యుటపాంగ్‌ తాంగ్డీ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందగా, అమిత్‌ ఫంగల్‌ సునాయాసంగా రమీష్‌ రహమాని (అఫ్ఘానిస్తాన్‌)ను చిత్తు చేశాడు. అయితే మరో భారత ఆటగాడు ఆశిష్‌ కుమార్‌ 64 కేజీల విభాగంలో ఇక్బొల్‌జొన్‌ ఖొల్‌దరొవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement