పతకాలకు అడుగుదూరంలో భారత బాక్సర్లు | Nikhat Zareen-preethi Pawar Reach Semi Finals In Asia Senior Boxing Championship | Sakshi
Sakshi News home page

పతకాలకు అడుగుదూరంలో భారత బాక్సర్లు

Apr 4 2026 8:24 AM | Updated on Apr 4 2026 9:22 AM

Nikhat Zareen-preethi Pawar Reach Semi Finals In Asia Senior Boxing Championship

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. శుక్రవారం జరిగిన మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు)తోపాటు హరియాణాకు చెందిన ప్రియ ఘన్‌ఘస్‌ (60 కేజీలు), ప్రీతి పవార్‌ (54 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్‌ చేరిన ఈ ముగ్గురికీ కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. 

జియాన్‌ బాగుహిన్‌ (ఫిలిప్పీన్స్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ తొలి రౌండ్‌లోనే విజయాన్ని అందుకుంది. నిఖత్‌ పంచ్‌లకు జియాన్‌ ఎదురు నిలువలేదు. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. 

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రియ 4:1తో చెంగ్యు యాంగ్‌ (చైనా)పై గెలుపొందగా... ప్రీతి 5:0తో మున్‌గున్‌ సెట్‌సెగ్‌ (మంగోలయా)ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్‌ దీపక్‌ (70 కేజీలు) నిరాశపరిచాడు. క్వార్టర్‌ ఫైనల్లో దీపక్‌ 1:4తో జాయెద్‌ ఇసాహష్‌ (జోర్డాన్‌) చేతిలో ఓడిపోయాడు.    

Advertisement
 
Advertisement
Advertisement