‘గేదెల రాజు’లో హీరోలు.. విలన్లు లేరు | Raghu Kunce Talk About Gedela Raju | Sakshi
Sakshi News home page

‘గేదెల రాజు’లో హీరోలు.. విలన్లు లేరు

Apr 5 2026 2:02 PM | Updated on Apr 5 2026 3:38 PM

Raghu Kunce Talk About Gedela Raju

‘‘మేం ఎన్ని చెప్పినా ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించేది కంటెంట్‌ మాత్రమే. మూవీలో కంటెంట్‌ ఉందని ఆడియన్స్‌ అనుకుంటే తప్పకుండా ఆదరిస్తారు. మా ‘గేదెల రాజు’లో మంచి కంటెంట్‌ ఉందని మేము నమ్ముతున్నాం... మా సినిమాని సక్సెస్‌ చేయండి’’ అని సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె చెప్పారు. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గేదెల రాజు’. రవి ఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. 

రఘు కుంచె నటించి, సమర్పించిన చిత్రమిది. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌లో చైతన్య మోటూరి మాట్లాడుతూ–‘‘మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. మా మూవీలో హీరోలు, విలన్స్‌ ఉండరు... పాత్రలు మాత్రమే ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మా అబ్బాయి చైతన్య మోటూరికి సినిమా మీద ఉన్న ప్యాషన్‌ను ఎంకరేజ్‌ చేయాలని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు వాణి రవికుమార్‌ మోటూరి.  

Advertisement
 
Advertisement
Advertisement