
క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పి.వి.సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.
గిమ్‌చియోన్ (కొరియా): ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)పై 4-21 21-13 21-18తో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో థాయలాండ్కు చెందిన బుసానన్ అంగబుంరంగపాన్తో సింధు తలపడుతుంది.
గురు సాయిదత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో వాంగ్ జు హుయ్ (చైనీస్ తైపీ)పై 17-21 21-13 21-19తో గెలుపొందాడు. తర్వాతి మ్యాచ్ లో చైనాకు చెందిన లియు కాయ్ పై పోటీ పడతాడు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు.