పి.టి. ఉషకు ఐఏఏఎఫ్‌ అవార్డు

PT Usha nominated for IAAF Veteran Pin Award - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్‌ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) ప్రతిష్టాత్మక ‘వెటరన్‌ పిన్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. మన దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంలాంటిదే ‘వెటరన్‌ పిన్‌’ అవార్డు. తను ఈ అవార్డుకు ఎంపికైన  విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో తెలియజేసింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్‌ వెటరన్‌ పిన్‌ అవార్డు అందజేస్తారు. అలాంటి విశిష్ట పురస్కారానికి నేను ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఐఏఏఎఫ్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేసింది. దోహాలో సెప్టెంబర్‌ 24న జరిగే ఐఏఏఎఫ్‌ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డు అందజేస్తారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top