పోరాడి ఓడిన టైటాన్స్‌ | Pro Kabaddi League Puneri Paltan Beat Telugu Titans 53-50 | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన టైటాన్స్‌

Oct 4 2019 2:48 AM | Updated on Oct 4 2019 2:48 AM

Pro Kabaddi League Puneri Paltan Beat Telugu Titans 53-50 - Sakshi

పంచకుల: తెలుగు టైటాన్స్‌ను గెలిపించడానికి రాకేశ్‌ గౌడ చేసిన పోరాటం వృథా అయ్యింది. గురువారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 50–53తో పుణేరి పల్టన్‌ చేతిలో ఓడింది. ఒక దశలో టైటాన్స్‌ 21–44 తో వెనుకబడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేట్లు కనిపించింది. అయితే రాకేశ్‌ గౌడ (17 పాయింట్లు), ఫర్హాద్‌ మిలాఘర్దన్‌ (10 పాయింట్లు) చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించారు. పుణేరి తరఫున మంజీత్‌ (12 పాయింట్లు), సుశాంత్‌ (11 పాయింట్లు) రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌; హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement