ప్రజ్ఞాన్ ఓజా తలకు గాయం | Pragyan Ojha gets hit on the head during Duleep Trophy match | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞాన్ ఓజా తలకు గాయం

Sep 8 2016 12:30 AM | Updated on Sep 4 2017 12:33 PM

ప్రజ్ఞాన్ ఓజా తలకు గాయం

ప్రజ్ఞాన్ ఓజా తలకు గాయం

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తూ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా గాయ ...

ఫీల్డింగ్ చేస్తుండగా ఘటన 

 
గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తూ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా గాయ పడ్డాడు. ఇండియా బ్లూ బ్యాట్స్‌మన్ పంక సింగ్ కొట్టిన బంతిని ఆపేందుకు లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓజా ముందుకు వచ్చాడు. అరుుతే ఒక్కసారిగా అనూహ్యంగా బౌన్‌‌స అరుున బంతి అతని వైపు దూసుకొచ్చింది. దాంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓజా వెనక్కి తిరగ్గా... బంతి అతని తల వెనుక భాగంలో బలంగా తగిలింది.

వెంటనే అతడిని స్టెచ్రర్‌పై మైదానం బయటికి తీసుకుపోయారు. సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. చివరకు అతను మెల్లగా కోలుకున్నాడు. ఓజాకు ప్రమాదమేమీ లేదని, అంతా బాగున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement