సచిన్ ఆందోళన.. క్షణాల్లో ట్వీట్ వైరల్!

Please remove all such accounts at the earliest, requests sachin

ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో తన కుటుంబసభ్యులకు చెందినవిగా కొన్ని ఖాతాలు క్రియేట్ చేసి వాటి నుంచి లేనిపోని విషయాలు పోస్టింగ్ కావడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ కు ఓ విజ్ఞప్తి చేశారు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ సచిన్ వరుస ట్వీట్లు చేశారు. కామెంట్లు, రీట్వీట్లతో ఆ ట్వీట్లు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది.

తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఆ పోస్టుల కారణంగా తప్పుగా అర్థం చేసుకుని తమ కుటుంబాన్ని గాయపరిచే అవకాశం ఉందన్నారు. గతంలో 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్‌ షాట్ తీసి షేర్ చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top