'కుంబ్లే లేకపోవడం లోటే' | Players coping well since Kumble's departure, says Sanjay Bangar | Sakshi
Sakshi News home page

'కుంబ్లే లేకపోవడం లోటే'

Jun 26 2017 11:29 AM | Updated on Sep 5 2017 2:31 PM

'కుంబ్లే లేకపోవడం లోటే'

'కుంబ్లే లేకపోవడం లోటే'

విజయవంతమైన కోచ్‌ అనిల్‌ కుంబ్లే లేకపోవడం లోటేనన్న భారత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సీనియర్లు జట్టుకు అవసరమేనని చెప్పారు.

న్యూఢిల్లీ: విజయవంతమైన కోచ్‌ అనిల్‌ కుంబ్లే లేకపోవడం లోటేనన్న భారత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌  సీనియర్లు జట్టుకు అవసరమేనని చెప్పారు. తామంతా ప్రొఫెషనల్స్‌ అని... ఇలాంటివి తమ కెరీర్‌లో భాగమేనన్నారు. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరిణతితో సవాళ్లను అధిగమించాలని సూచించారు.

కుంబ్లే రాజీ నామాపై స్పందిస్తూ ‘నిజమే... అనిల్‌ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లారు. చెప్పుకోదగ్గ ఫలితాలు ఆయన కోచింగ్‌లోనే వచ్చాయి. ఆ విజయాల్ని జట్టంతా ఆస్వాదించింది. అలాంటి కోచ్‌ లేకపోవడం కచ్చితంగా లోటే! జట్టు విజయాలేవీ ఒక్క కోచ్‌తోనూ, కెప్టెన్‌తోనూ రావు. ఆలోచనల్ని పంచుకోవడం... ప్రణాళికల్ని ఆచరణలో పెట్టడం వల్లే వస్తాయి’ అని బంగర్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement