వారం రోజుల్లో పీలే డిశ్చార్జి | Pele to be discharged from hospital within week | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో పీలే డిశ్చార్జి

Nov 30 2014 9:13 AM | Updated on Sep 2 2017 5:24 PM

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.

రియో డి జెనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు. మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆయన కుమారుడు ఎడినో చెప్పారు.

 'పీలే ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పీలేను ఎప్పుడు డిశ్చార్జీ చేస్తారన్న విషయం ఇంకా నిర్ధారించలేదు. వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తారు' అని వైద్యులు తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement