బీసీసీఐ కార్యదర్శితో పీసీబీ చీఫ్ భేటి | pcb cheif meets secretary of bcci | Sakshi
Sakshi News home page

బీసీసీఐ కార్యదర్శితో పీసీబీ చీఫ్ భేటి

Mar 10 2015 1:01 AM | Updated on Sep 2 2017 10:33 PM

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్... ఆదివారం బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్... ఆదివారం బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని ఠాకూర్ తెలిపారు. ‘రెండు బోర్డుల మధ్య స్నేహసంబంధాలు ఉండాలని మేం కోరుకున్నాం’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement