కశ్యప్‌కు చుక్కెదురు | Parupalli Kashyap Loses in Singapore Open Semis | Sakshi
Sakshi News home page

కశ్యప్‌కు చుక్కెదురు

Apr 12 2015 1:03 AM | Updated on Sep 3 2017 12:10 AM

కశ్యప్‌కు చుక్కెదురు

కశ్యప్‌కు చుక్కెదురు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో చుక్కెదురైంది.

 సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో చుక్కెదురైంది. శనివారం జరిగిన సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 22-20, 11-21, 14-21తో ప్రపంచ 13వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో కశ్యప్ చెలరేగిపోయాడు. ఆరంభంలో 12-4 ఆధిక్యానికి దూసుకెళ్లాడు. తర్వాత అదే జోరును కనబరుస్తూ 19-15 ఆధిక్యంలో నిలిచినా.. యున్ పుంజుకుని 19-19, 20-20తో స్కోరును సమం చేశాడు. ఈ దశలో కశ్యప్ చకచకా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తర్వాతి రెండు గేముల్లో కశ్యప్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement