breaking news
Singapore Badminton Open
-
పీవీ సింధుని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్-2022లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధును సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకుపోతూ తన ఆటతో కెరియర్లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్‌తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్, వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్‌లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సింధూ మాట్లాడుతూ.. తనను వ్యక్తిగతంగా కలిసి శుభాభినందనలు తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకొని, సింగపూర్‌లో నివశించే తెలుగు వారికి సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు. సింగపూర్ తెలుగు సమాజం జూలై 31న నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్లో పాల్గొననున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు 13న సింగపూర్‌లో నివసించే తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీలు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కశ్యప్‌కు చుక్కెదురు
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సింగపూర్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో చుక్కెదురైంది. శనివారం జరిగిన సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 22-20, 11-21, 14-21తో ప్రపంచ 13వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో కశ్యప్ చెలరేగిపోయాడు. ఆరంభంలో 12-4 ఆధిక్యానికి దూసుకెళ్లాడు. తర్వాత అదే జోరును కనబరుస్తూ 19-15 ఆధిక్యంలో నిలిచినా.. యున్ పుంజుకుని 19-19, 20-20తో స్కోరును సమం చేశాడు. ఈ దశలో కశ్యప్ చకచకా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తర్వాతి రెండు గేముల్లో కశ్యప్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.