ఆరో ర్యాంక్‌కు పాక్ | pakistan in sixth place | Sakshi
Sakshi News home page

ఆరో ర్యాంక్‌కు పాక్

Sep 15 2013 1:49 AM | Updated on Sep 1 2017 10:43 PM

రెండో టెస్టులో జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. శనివారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంక్‌కు పడిపోయింది.

దుబాయ్: రెండో టెస్టులో జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. శనివారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంక్‌కు పడిపోయింది.
 
 ఎలాంటి ర్యాంక్ లేకుండా సిరీస్‌ను మొదలుపెట్టిన జింబాబ్వే 34 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకుంది. 2006లో టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన జింబాబ్వే 2011లో పునరాగమనం చేసింది. ఈ ఐదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడంతో రేటింగ్ పాయింట్లు లభించలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement