
మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు
ప్రపంచకప్ లో అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకెక్కారు.
కరాచీ: ప్రపంచకప్ లో అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకెక్కారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లుడెన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటువంటి అవమానకర ప్రవర్తనను తాను సహించబోనని, ఫీల్డింగ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ కు మెసేజ్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం ప్రాక్టీసు చేస్తున్నప్పుడు షాహిద్ ఆఫ్రిది, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ ఆరోపించాడు. అయితే లెడెన్ ఫిర్యాదు చేసిన విషయాన్ని పీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ కు ముందు టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.