breaking news
fielding coach Grant Luden
-
పాక్ జట్టులో రభస.. ఫీల్డింగ్ కోచ్ రాజీనామా
మెల్బోర్న్: వివాదాలకు మారుపేరయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్‌లోనూ తన తీరు మార్చుకోలేదు. ఆస్ట్రేలియాలో ఇటీవల ఘర్షణపడ్డ పాక్ ఆటగాళ్లు.. తాజాగా సొంత ఫీల్డింగ్ స్టాఫ్‌తోనే దురుసుగా ప్రవర్తించారు. పాక్ క్రికెటర్లు అక్మల్, అఫ్రీది, షెహజాద్ గొడవపడి దూషించడంతో మనస్తాపానికి గురైన ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పదవి నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. లూడెన్ ఆటగాళ్ల ప్రవర్తన గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ప్రాక్టీసు సెషన్ సందర్భంగా ఆఫ్రిది, షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ బోర్డుకు తెలియజేశాడు. అనంతరం పదవికి రాజీనామా చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. టీమిండియాతో మ్యాచ్ కు ముందు కూడా పాక్ ఆటగాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘించారు. షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు
కరాచీ: ప్రపంచకప్ లో అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకెక్కారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లుడెన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటువంటి అవమానకర ప్రవర్తనను తాను సహించబోనని, ఫీల్డింగ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ కు మెసేజ్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ప్రాక్టీసు చేస్తున్నప్పుడు షాహిద్ ఆఫ్రిది, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ ఆరోపించాడు. అయితే లెడెన్ ఫిర్యాదు చేసిన విషయాన్ని పీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ కు ముందు టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.