
పాక్‌దే టెస్టు సిరీస్
స్పిన్ త్రయం యాసిర్ షా (4/44), షోయబ్ మాలిక్ (3/26), బాబర్ (2/31)లు ముగ్గురు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో
ఇంగ్లండ్‌పై 2-0తో గెలుపు ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గిన మిస్బాసేన
షార్జా: స్పిన్ త్రయం యాసిర్ షా (4/44), షోయబ్ మాలిక్ (3/26), బాబర్ (2/31)లు ముగ్గురు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో గురువారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఆఖరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
పాక్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 60.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. కుక్ (63) టాప్ స్కోరర్. 46/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌ను పాక్ స్పిన్నర్లు వణికించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కట్టడి చేశారు. యాసిర్ షాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’; హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు లభించాయి.