'పాక్- జింబాబ్వే క్రికెట్ మ్యాచ్' లక్ష్యంగా దాడి | One killed in suicide blast outside Pakistan stadium | Sakshi
Sakshi News home page

'పాక్- జింబాబ్వే క్రికెట్ మ్యాచ్' లక్ష్యంగా దాడి

May 30 2015 10:44 AM | Updated on Nov 6 2018 8:35 PM

ఘటనా స్థలంలో  పాక్ భద్రతా బలగాల తనిఖీలు - Sakshi

ఘటనా స్థలంలో పాక్ భద్రతా బలగాల తనిఖీలు

పాకిస్థాన్- జింబాబ్వేల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది.

పాకిస్థాన్- జింబాబ్వేల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది. శుక్రవారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్ డే ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉగ్రవాది అక్కడిక్కడే తనను పేల్చుకున్నాడు.

ఈ దాడిలో ఒక  ఎస్సై మరణించగా, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు అన్నిదేశాలు నిరాకరించిన నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రత హామీపై జింబాబ్వే జట్టు పాక్లో పర్యటిస్తోంది. స్టేడియం సమీపంలో ఉగ్రదాడి విషయం బయటికి వస్తే పరువు మరింత దిగజారుతుందని భావించిన పాక్ ప్రభుత్వం సంబంధిత వార్తలను ప్రసారం చెయ్యొద్దని బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ను ఆదేశించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement