ఓక్రిడ్జ్‌లో ‘ఆర్సెనల్’ శిక్షణా శిబిరం ప్రారంభం | Oakridge 'Arsenal', the start of training camp | Sakshi
Sakshi News home page

ఓక్రిడ్జ్‌లో ‘ఆర్సెనల్’ శిక్షణా శిబిరం ప్రారంభం

May 1 2014 11:37 PM | Updated on Sep 2 2017 6:47 AM

ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సాకర్ క్లబ్ ఆర్సెనల్‌కు చెందిన కోచ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో కోచింగ్ క్యాంప్ గురువారం ప్రారంభమైంది.

రాయదుర్గం, న్యూస్‌లైన్: ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సాకర్ క్లబ్ ఆర్సెనల్‌కు చెందిన కోచ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో కోచింగ్ క్యాంప్ గురువారం ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను ఓక్రిడ్జ్ పాఠశాల ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ ప్రారంభించారు. రోజుకు మూడు విడతల్లో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తారు.

ఈనెల 6వ తేదీ వరకు ఆరేళ్ళ నుంచి 15 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ క్యాంప్ కొనసాగుతుంది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు సాగే మొదటి బ్యాచ్‌లో 14 మంది, 9 నుంచి 10.30 గంటల వరకు సాగే బ్యాచ్ 34 మంది, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు సాగే బ్యాచ్‌లో 34 మందికి ఆర్సెనల్ కోచ్ జువాన్ శిక్షణ ఇవ్వనున్నారు.
 
 ఈ క్యాంప్‌లో ఓక్రిడ్జ్ ఖాజాగూడతోపాటు బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు, నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆజ్మీర్‌కు చెందిన విద్యార్థులు  పాల్గొంటు న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో రాణించే విద్యార్థులకు మరిన్ని మెళకువలను నేర్పించాలని భావించే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌లో రాణిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని భావించి అత్యధిక ప్రాధాన్యత పొందిన అర్సెనల్ కోచ్‌లతో శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement