‘గంగూలీ తర్వాత కోహ్లినే’

Not seen such aggression that Virat Kohli displays, saus Syed Kirmani - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ సయ్యద్‌ కిర్మానీ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లి లాంటి దూకుడు ఉన్న క్రికెటర్‌ను ఎక్కడా చూడలేదనన్నారు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లిలోనే చూశానని, అదే అతనికి విజయాలు తెచ్చి పెడుతుందని అభిప్రాయపడ్డాడు.

‘టీమిండియా క్రికెటర్ల బ్యాటింగ్ విధానం చూశాను. ఎవరికి వాళ్లది భిన‍్నమైన శైలి.  కానీ జట్టు సారథి విరాట్‌ కోహ్లిలో మాత్రం ఆకర్షణీయమైన బ్యాటింగ్‌ లక్షణం ఉంది. మ్యాచ్‌ను గెలిపించాలనే తన తపన మాటల్లో చెప్పలేనిది. అంత దూకుడుగా ఉండటం తనకే సాధ్యం. మూడు ఫార్మాట్లలోనూ అసాధారణ ప్రదర్శనను కనబర్చుతున్నాడు. అన్ని రికార్డులనూ బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లికి మాత్రమే సాధ్యం. నాకు తెలిసీ కోహ్లి ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించడనుకుంటా. కానీ అతను ఏమి చేయాలో అది చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నిజమైన నాయకత్వ లక్షణాలన్నీ కోహ్లిలో ఉన్నాయి. సౌరవ్‌ గంగూలీ తర్వాత అంతటి దూకుడును నేను కోహ్లిలోనే చూశాను’ అని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top