రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అనవరసమని ఆ జట్టు ఆటగాడు కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు.
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అనవరసమని ఆ జట్టు ఆటగాడు కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగే మ్యాచ్లో తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు. రేపటి మ్యాచ్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ స్థానాన్ని ఏమైనా మారుస్తారా?అన్న ప్రశ్నకు జాదవ్ బదులిచ్చాడు. 'సర్పరాజ్ బ్యాటింగ్ ఆర్డర్ను పైకి తీసుకురావాల్సి అవసరం లేదు. ఐదో స్థానంలోసర్పరాజ్ మెరుగ్గా ఆడుతున్నాడు. అటువంటప్పుడు మార్పులు అనవసరం'అని కేదర్ స్పష్టం చేశాడు.
తమ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఆటపై ఎటువంటి ఆందోళనా లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో బంతి గేల్ ప్యాడ్లను తాకి వికెట్లను నేలకూల్చిందని, అది నిజంగా అతని బ్యాడ్లక్ మాత్రమేనని కేదర్ తెలిపాడు.