స్టోక్స్‌కు సారీ చెప్పే ప్రసక్తే లేదు: బ్రాడ్‌

No need to say sorry To Stokes, Stuart Broad - Sakshi

సెంచూరియన్‌: గతేడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ క్రికెటర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌-బెన్‌ స్టోక్స్‌ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి పెదవి విప‍్పాడు స్టువర్ట్‌ బ్రాడ్‌. బ్రేక్‌ సమయంలో తమ ఆటగాళ్లను ఉత్సాహ పరిచే పనిలో ఉంటే దానిని స్టోక్స్‌ అడ్డుకోవడమే కాకుండా కాస్త దురుసగా ప్రవర్తించాడన్నాడు. ఈ విషయంలో తనదేమీ తప్పులేదని, స్టోక్స్‌కు క్షమాపణలు చెప్పాల్సిన పని కూడా లేదంటూ తేల్చిచెప్పాడు. ‘ ఆ మ్యాచ్‌లో మేము  చాలా విరామం తర్వాత వికెట్‌ సాధించాం. దాంతో  బ్రేక్‌ వచ్చింది. ఈ సమయంలో మా బాయ్స్‌లో ప్రేరణ నింపే పనిలో ఉన్నా. మన పూర్తిస్థాయి ఆటకు సిద్ధం కావాలి. బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌ బౌలింగ్‌ వేయాలి. ఫీల్డర్లు సింగిల్‌ తీసే అవకాశం  కూడా ఇవ్వకూడదు’ అని తమ ఆటగాళ్లలో స్పూర్తిని నింపడానికి యత్నించిన విషయాన్ని చెప్పాడు. (ఇక్కడ చదవండి: స్టోక్స్‌-బ్రాడ్‌ల వాడివేడి వాగ్వాదం.. వీడియో వైరల్‌)

అప్పుడు స్టోక్స్‌ తన దగ్గరకు వచ్చి తాను చెప్పిన దానితో అంగీకరించలేదన్నాడు. అలా చెప్పడాన్ని గొప్ప విషయం కాదంటూ కించపరిచేలా మాట్లాడాడని బ్రాడ్‌ చెప్పుకొచ్చాడు. ముందు ఆ పని నువ్వు చేసి చూపించి అంటూ తనతో వాగ్వాదానికి దిగాడన్నాడు. తాము అన్ని విషయాల్లో బాగానే ఉన్నామని, నువ్వు శ్రమించూ అంటూ కౌంటర్‌ వాదనకు దిగాడన్నాడు. ఆ సమయంలో తాము పూర్తి స్వింగ్‌లో లేమని, తాను ఆటగాళ్లను ఉత్సాహ పరిచేందుకు యత్నించానన్నాడు. కాసేపటికి స్టోక్స్‌ తన దగ్గరకు వచ్చి కరాచలనం చేశాడన్నాడు. ఆ రోజు సాయంత్రం తనకు సారీ మేట్‌ అంటూ మెసేజ్‌ చేశాడన్నాడు. అది తనకు సంతృప్తినివ్వలేదన్నాడు. ఈ విషయంలో స్టోక్స్‌కు తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నాడు. అదొక గేమ్‌ అనే సంగతి తెలుసుకోవాలని, జట్టును కమ్యూనికేట్‌ చేయడం గేమ్‌లో భాగమన్నాడు. ఇక్కడ తన తప్పు ఏమీ లేదన్నాడు. అటువంటప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటూ ఎదురు ప్రశ్నించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top