రవిశాస్త్రి కొత్త ప్రేమ!  | Nimrat Kaur dating Indian cricket coach Ravi Shastri? | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రి కొత్త ప్రేమ! 

Sep 4 2018 1:17 AM | Updated on Apr 3 2019 6:34 PM

Nimrat Kaur dating Indian cricket coach Ravi Shastri? - Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం జట్టుతో పాటు కోచ్‌ రవిశాస్త్రిపై ఒకవైపు తీవ్ర విమర్శలు సాగుతుండగా... మరోవైపు శాస్త్రి కొత్త ప్రేమ పురాణం ఒకటి బయటపడింది. స్థానిక మీడియా కథనం ప్రకారం గత రెండేళ్లుగా రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నాడు. ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడి’కి వీరిద్దరు సంయుక్తంగా బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారు ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు మొదలైన ప్రేమే మరింత గాఢంగా మారిందని సమాచారం.
 

బాలీవుడ్‌లో మంచి ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న 36 ఏళ్ల నిమ్రత్‌ ది లంచ్‌ బాక్స్, ఎయిర్‌లిఫ్ట్‌ చిత్రాలతో గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె టీవీ వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో సుదీర్ఘ కాలం నటి అమృతాసింగ్‌తో ప్రేమాయణం సాగించిన 56 ఏళ్ల రవిశాస్త్రి 1990లో రీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పదేళ్ల వయసున్న కూతురు ఉంది. అయితే చాలా కాలంగా శాస్త్రి, అతని భార్య విడివిడిగా ఉంటున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement