మళ్లీ రోస్బర్గ్కే ‘పోల్’ | Nico Rosberg beats Hamilton to German Grand Prix pole | Sakshi
Sakshi News home page

మళ్లీ రోస్బర్గ్కే ‘పోల్’

Jul 31 2016 1:53 AM | Updated on Aug 1 2018 4:17 PM

సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రాణించాడు.

హాకెన్‌హీమ్ (జర్మనీ) : సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రాణించాడు. ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 14.363 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది ఐదో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement