మెస్సీ, రోనాల్డో కంటే అతనే బెస్ట్! | Neymar better than Messi, Ronaldo, says Roberto Carlos | Sakshi
Sakshi News home page

మెస్సీ, రోనాల్డో కంటే అతనే బెస్ట్!

Sep 18 2015 6:32 PM | Updated on Sep 3 2017 9:35 AM

తన దృష్టిలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ, పోర్చుగల్ దిగ్జజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డ్ లు అత్యుత్తమ ఆటగాళ్లు కానేకాదని బ్రెజిల్ లెజెండ్ రాబొర్టో కార్లోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గోథెన్ బర్గ్(స్వీడన్): తన దృష్టిలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ, పోర్చుగల్ దిగ్జజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డ్ లు అత్యుత్తమ ఆటగాళ్లు కానేకాదని బ్రెజిల్ లెజెండ్  రాబొర్టో కార్లోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రపంచమంతా వారిద్దర్ని అత్యుత్తమ ఆటగాళ్లుగా భావిస్తున్నా.. వారు తమ తమ జట్లుకు సాధించి పెట్టింది ఏమీ లేదంటూ కార్లోస్ ఎద్దేవా చేశాడు.

 

ఐసీఎల్(ఇండియన్ సూపర్ లీగ్)లో ఢిల్లీ డైనమాస్ కు ఆటగాడిగా, మేనేజర్ గా కొనసాగుతున్న కార్లోస్.. తన దృష్టిలో ఫుట్ బాల్ లో చెప్పుకోదగిన ఆటగాడు ఎవరైనా ఉంటే అది నెయమార్ మాత్రమేని స్పష్టం చేశాడు. 'లియోనల్ మెస్సీ,  క్రిస్టియానో రోనాల్డ్ లు గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచలోని ఫుట్ బాల్ అభిమానులు అనుకుంటారు. నా దృష్టిలో వారికంటే నెయమార్ ఓ గొప్ప ఆటగాడు. బ్రెజిల్ ను నెయమార్ అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లడమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది' అని  కార్లోస్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement