ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు నిర్వాహకులకు ఎఫ్1 యజమాని బెర్నీ ఎకిల్‌స్టోన్ షాకిచ్చారు. ఇప్పటికే 2014లో రేసును రద్దు చేయగా, 2015లోనూ భారత్‌లో రేసు జరగబోదని ప్రకటించారు.
ఫార్ములావన్ రేసుపై ఎకిల్‌స్టోన్
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు నిర్వాహకులకు ఎఫ్1 యజమాని బెర్నీ ఎకిల్‌స్టోన్ షాకిచ్చారు. ఇప్పటికే 2014లో రేసును రద్దు చేయగా, 2015లోనూ భారత్‌లో రేసు జరగబోదని ప్రకటించారు.
భారీ స్థాయిలో పన్నులతో పాటు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వేధింపుల కారణంగానే వచ్చే ఏడాది కూడా భారత్‌కు అవకాశం ఇవ్వడం లేదని ఎకిల్‌స్టోన్ స్పష్టం చేశారు. 2016 నాటికి ఈ సమస్యల్ని అధిగమిస్తే తిరిగి పరిశీలిస్తామన్నారు. దీంతో వచ్చే ఏడాదైనా మళ్లీ రేసు నిర్వహించాలన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో 2011 నుంచి మూడేళ్లపాటు ఇండియన్ గ్రాండ్‌ప్రి జరిగింది.