సఫారీలపై కివీస్ ప్రతీకార విజయం | newzealand wins 2nd t20 against south africa | Sakshi
Sakshi News home page

సఫారీలపై కివీస్ ప్రతీకార విజయం

Aug 16 2015 11:22 PM | Updated on Sep 3 2017 7:33 AM

విజయానందంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు

విజయానందంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు

ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో మొదటి టీ20లో ఓటమిచెందిన న్యూజిలాండ్ జట్టు.. రెండో టీ 20లో ప్రతీకార విజయాన్ని సాధించింది.

సెంచూరియన్: ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో మొదటి టీ20లో ఓటమిచెందిన న్యూజిలాండ్ జట్టు.. రెండో టీ 20లో ప్రతీకార విజయాన్ని సాధించింది. సెంచురియన్ సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా..లక్ష్యచేధనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌లో మార్టిన్ గుప్టిల్ 60 పరుగులు చేయగా..దక్షిణాఫ్రికాలో బెహర్డీన్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంలో సిరీస్ సమం అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు రెండూ మార్టిన్ గుప్టిల్ కే దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే ఆగస్టు 19న జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement