న్యూజిలాండ్‌ టీమ్‌ రెడీ | New Zealand team ready | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ టీమ్‌ రెడీ

Jan 15 2014 6:13 PM | Updated on Sep 2 2017 2:38 AM

ఇండియాతో వన్డే క్రికెట్ సిరీస్‌కు ఒక మార్పుతో న్యూజిలాండ్‌ టీమ్‌ రెడీ అయింది.

ఆక్లాండ్: ఇండియాతో వన్డే క్రికెట్ సిరీస్‌కు ఒక మార్పుతో న్యూజిలాండ్‌ టీమ్‌ రెడీ అయింది. సెలెక్టర్లు ప్రకటించిన 13 మంది క్రీడాకారుల బృందంలో  కోలిన్‌ మున్రోకు చోటు దక్కలేదు. కాగా గాయం నుండి కోలుకున్న ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌతీకి జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్లో 5 వన్డే మ్యాచ్లు ఆడతారు.

 వెస్టిండీస్‌తో ఇటీవల వన్డే సిరీస్‌ను 2-2గా డ్రా చేసుకున్న కివీస్‌ టీమ్‌లో వున్నప్పటికీ, మున్రో ఆడలేకపోయాడు. ఇదే సిరీస్‌లోని మూడో వన్డేలో అండర్సన్‌ 36 బంతుల్లో సెంచరీ కొట్టి పాక్‌ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ ఆఫ్రిది పేరు మీదున్న ఫాస్టెస్ట్‌ వన్డే సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో జెస్సీ రైడర్‌ కూడా తన ఫాస్టెస్ట్‌ సెంచరీని కంప్లీట్‌ చేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement