కివీస్‌కు ఆధిక్యం

New Zealand lead by 138 runs, stumps on Day 4 - Sakshi

కొలంబో: శ్రీలంక–న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు వర్షం అడ్డంకి తప్పడం లేదు. వాన కారణంగా నాలుగో రోజు ఆదివారం 48 ఓవర్లే పడ్డాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 196/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌... వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వాట్లింగ్‌ (208 బంతుల్లో 81 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ (75 బంతుల్లో 83 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకాలతో 382/5తో నిలిచింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ 154 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు 138 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top