టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీ | New Jersey T-20 World Cup | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీ

Mar 3 2016 11:11 PM | Updated on Sep 3 2017 6:55 PM

టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీ

టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీ

టి20 ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగబోతున్నాయి.

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగబోతున్నాయి. ఈమేరకు గురువారం స్పాన్సర్ నైకీ తమ కొత్త కిట్‌ను ఆవిష్కరించింది. ఆసియా సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త జెర్సీ కాలర్ (బంద్ గలా రీతిలో)తో పాటు ఎడమవైపు నుంచి కుడి భుజం వైపునకు నారింజ రంగులో గీతలు ఉండబోతున్నాయి. అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాంట్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చారు.

‘నీలి రంగుతో కూడిన జెర్సీని ధరించి దేశం తరఫున ఆడడం ప్రతీ ఆటగాడు గర్వకారణంగా భావిస్తాడు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది’ అని బ్యాట్స్‌మన్ అజింక్య రహానే అన్నాడు. జెర్సీ అనేది ఆటగాళ్ల బాధ్యతను గుర్తు చేస్తుందని మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. మార్చి 15 నుంచి రెండు జట్ల ఆటగాళ్లు అధికారికంగా కొత్త జెర్సీని ధరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement