ఆరు ఓవర్ల మ్యాచ్లో నెదర్లాండ్స్ విజయం | Netherlands beats ireland by 12 runs | Sakshi
Sakshi News home page

ఆరు ఓవర్ల మ్యాచ్లో నెదర్లాండ్స్ విజయం

Mar 13 2016 7:18 PM | Updated on Sep 3 2017 7:40 PM

ఆరు ఓవర్ల మ్యాచ్లో నెదర్లాండ్స్ విజయం

ఆరు ఓవర్ల మ్యాచ్లో నెదర్లాండ్స్ విజయం

టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ 12 పరుగులతో విజయం సాధించింది.

ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ 12 పరుగులతో విజయం సాధించింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ను 6 ఓవర్ల చొప్పున కుదించారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్ మైబర్గ్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ బోరెన్ 14 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్ డాక్రెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యసాధనలో ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు వాన్ మీకెరెన్ నాలుగు, వాండర్ మెర్వ్ రెండు వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement