తెలంగాణ ముందంజ | National Softball Championship Telangana Start With Wins | Sakshi
Sakshi News home page

తెలంగాణ ముందంజ

Oct 2 2019 10:15 AM | Updated on Oct 2 2019 10:15 AM

National Softball Championship Telangana Start With Wins - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు ముందంజ వేసింది. ఆంధ్రప్రదేశ్‌ వేదికగా మంగళవారం జరిగిన పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 8–3తో బిహార్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ 3–1తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించగా... ఛత్తీస్‌గఢ్‌ 2–0తో కేరళపై, మహారాష్ట్ర 12–0తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. మహిళల విభాగంలో మహారాష్ట్ర 8–0తో రాజస్తాన్‌పై, చండీగఢ్‌ 4–3తో ఆంధ్రప్రదేశ్‌పై, కేరళ 10–0తో పాండిచ్చేరిపై నెగ్గి ముందంజ వేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement