సురేఖకు స్వర్ణం | National Archery Championship | Sakshi
Sakshi News home page

సురేఖకు స్వర్ణం

Apr 13 2018 1:27 AM | Updated on Apr 13 2018 1:27 AM

National Archery Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ కాంపౌండ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ మెరిసింది. పుణేలో గురువారం జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత ఒలింపిక్‌ రౌండ్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో సురేఖ 145–143తో త్రిషా దేబ్‌ (ఆర్‌ఎస్‌పీబీ)పై గెలుపొంది విజేతగా నిలిచింది.

గత ఆరేళ్లలో జాతీయ చాంపియన్‌గా నిలవడం సురేఖకు ఇది నాలుగోసారి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాక్షి వేద్వాన్‌ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ర్యాంకింగ్‌ రౌండ్‌లో నిర్ణీత 720 పాయింట్లకు గానూ, 701 పాయింట్లు సాధించి సురేఖ రజతాన్ని గెలుచుకుంది.     

Advertisement
 
Advertisement
Advertisement