పంజాబ్‌పై నరైన్‌ బల్లే బల్లే.. | Narine fifty powers KKR | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై నరైన్‌ బల్లే బల్లే..

May 12 2018 4:55 PM | Updated on May 12 2018 5:01 PM

 Narine fifty powers KKR - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో​ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ మరోసారి దూకుడును ప్రదర్శించాడు. ఆరంభం నుంచి కింగ్స్‌ బౌలర్లపై విరుచుకుపడిన నరైన్‌.. 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. ఫలితంగా ఈ సీజన్‌లో రెండో అర్థ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత లిన్‌(27;17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై నరైన్‌తో రాబిన్‌ ఉతప్ప ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే నరైన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. నరైన్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆండ్రూ టై బౌలింగ్‌లో ఔటయ్యాడు. 36 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేసిన తర్వాత నరైన్ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement