నాగరాజుకు స్వర్ణం | nagaraju won gold medal | Sakshi
Sakshi News home page

నాగరాజుకు స్వర్ణం

Jan 2 2014 11:48 PM | Updated on Sep 2 2017 2:13 AM

రాష్ట్ర సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జూడో క్రీడాకారులు ఎం.నాగరాజు యాదవ్, ఎన్.నాగరాజు సత్తా చాటారు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జూడో క్రీడాకారులు ఎం.నాగరాజు యాదవ్, ఎన్.నాగరాజు సత్తా చాటారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈపోటీల్లో 90 కేజీ కన్నా తక్కువ విభాగంలో ఎం.నాగరాజు యాదవ్, 100 కేజీలపై విభాగంలో ఎన్.నాగరాజు స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు.
 
  100 కేజీల కన్నా తక్కువ కేటగిరీలో జె.రాఘవేంద్రరావు రజత పతకాన్ని దక్కించుకున్నాడు. వీరిని  రాష్ట్ర జూడో అసోసియేషన్ (ఏపీజేఏ) ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ (ఆర్‌ఆర్‌డీజేఏ) ప్రధాన కార్యదర్శి  ఎం.అలీఖాన్ అభినందించారు. ఎం.నాగరాజు యాదవ్, ఎన్.నాగరాజు వచ్చేనెల 9 నుంచి 12 దాకా హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement