ఉత్కంఠ పోరులో ముంబైదే విజయం

Mumbai Indians Won The Match Against KXIP - Sakshi

రోహిత్‌ సేన ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం

రాహల్‌ పోరాటం వృథా

రాణించిన బుమ్రా

ముంబై : కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 187 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ ఛేదించలేకపోయింది. కేఎల్‌ రాహుల్‌ (94: 60 బంతులు,10 ఫోర్లు,3 సిక్స్‌లు), ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) లు దాటిగా ఆడినా చివర్లో బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడికి చిత్తవ్వడంతో 3 పరుగుల తేడాతో ముంబై విజయాన్నందుకుంది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆండ్రూ టై(4/ 16) దాటికి కుదేలైంది. పోలార్డ్‌ (50: 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కృనాల్‌(32: 23 బంతుల్లో,1 ఫోర్‌,1 సిక్స్‌),  సూర్యకుమార్‌ యాదవ్‌(27: 15 బంతుల్లో 3 ఫోర్‌, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు‌)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది.

రాహుల్‌ వీరవిహారం..
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. అయితే క్రిస్‌ గేల్‌ (18: 11బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) నిరాశ పరచగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో దూకుడు మీదున్న రాహుల్‌ క్రీజులోకి వచ్చిన ఫించ్‌తో దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో  4 ఫోర్లు,1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఫించ్‌ సైతం దాటిగా ఆడాడు. దీంతో పంజాబ్‌ 12.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. బుమ్రా వేసిన 17 ఓవర్‌లో ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌ (1) తీవ్రంగా నిరాశపరిచాడు.

మ్యాచ్‌ను తిప్పేసిన బుమ్రా
పంజాబ్‌ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సి ఉండగా బుమ్రా పంజాబ్‌ విజయాన్ని లాగేశాడు. అద్భుత బంతితో రాహుల్‌ (94: 60 బంతులు,10 ఫోర్లు,3సిక్స్‌లు)ను బోల్తా కొట్టించిన బుమ్రా ఈ ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు . చివరి ఓవర్లో పంజాబ్‌ విజయానికి కావాల్సిన 17 పరుగులను చేయడంలో యువరాజ్‌ సింగ్‌, అ‍క్షర్‌  పటేల్‌లు విఫలమవ్వడంతో పంజాబ్‌ ఓటమిని చవిచూసింది. మెక్లీగన్‌ వేసిన ఈ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగగా.. ఆవెంటనే అ‍క్షర్‌ సిక్స్‌ బాది పంజాబ్‌ శిభిరంలో ఆశలు రేపాడు కానీ తరువాత పరుగులు రాబట్టడంతో విఫలమవ్వడంతో బంతి మిగిలి ఉండగానే ముంబై విజయం లాంఛనమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు, మెక్లిగన్‌ రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు

17-05-2018
May 17, 2018, 01:37 IST
పొట్టి ఫార్మాట్‌లో, మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో రెప్పపాటులో పరిస్థితులు తారుమారు అవుతాయి. లీగ్‌ ఆరంభంలో తడబడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు...
17-05-2018
May 17, 2018, 01:34 IST
పంజాబ్‌ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు రావాలి...అద్భుతంగా చెలరేగిపోతున్న లోకేశ్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉండటంతో లక్ష్యం సునాయాసంగా ఛేదించేలా...
16-05-2018
May 16, 2018, 22:15 IST
ముంబై : ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ జూలు విదిల్చాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అర్ధ...
16-05-2018
May 16, 2018, 20:49 IST
ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్‌ ఆండ్రూ టై విజృంభించాడు....
16-05-2018
May 16, 2018, 19:46 IST
ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా మరో రసవత్తర పోరుకు వాంఖేడే మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌...
16-05-2018
May 16, 2018, 11:57 IST
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సురేశ్‌ రైనా చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున అడుతున్న విషయం తెలిసిందే. రైనా తన కూతురు గ్రేసియా బర్త్‌డే వేడుకను...
16-05-2018
May 16, 2018, 11:50 IST
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు....
16-05-2018
May 16, 2018, 01:27 IST
మ్యాచ్‌కు ముందు ఇరు జట్లదీ దాదాపు ఒకే స్థితి. సమాన సంఖ్యలో విజయాలు, పాయింట్లు. నెట్‌రన్‌రేట్‌ కూడా సుమారుగా సమమే....
15-05-2018
May 15, 2018, 23:31 IST
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 6...
15-05-2018
May 15, 2018, 22:40 IST
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 142 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ ఓడి...
15-05-2018
May 15, 2018, 21:48 IST
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ  ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 143...
15-05-2018
May 15, 2018, 20:53 IST
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించింది. రాజస్తాన్‌ రాయల్స్‌...
15-05-2018
May 15, 2018, 19:50 IST
కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా మంగళవారం ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌...
15-05-2018
May 15, 2018, 18:44 IST
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్‌పై ఆశల్ని సజీవంగా...
15-05-2018
May 15, 2018, 11:03 IST
ఇండోర్‌ : ఐపీఎల్‌లో రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు అరుదైన రికార్డును నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ను చిత్తు చేసిన...
15-05-2018
May 15, 2018, 02:18 IST
స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానేపై భారీ జరిమానా పడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో...
15-05-2018
May 15, 2018, 01:44 IST
ఐపీఎల్‌ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో ఇద్దరినే నమ్ముకొని విజయాలు సాధిస్తూ వచ్చిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆ ఇద్దరు విఫలమైతే...
14-05-2018
May 14, 2018, 22:52 IST
ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో...
14-05-2018
May 14, 2018, 22:28 IST
ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఇక్కడ కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో...
14-05-2018
May 14, 2018, 21:27 IST
ఇండోర్‌: కింగ్స్‌ పంజాబ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. స్టార్‌ ఆటగాళ్లున్నా ఆ జట్టు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top