ఎంఎస్‌ ధోని న్యూలుక్‌

MS Dhoni sports trendy V Hawk hairstyle - Sakshi

ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తాజాగా కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. ధోని ఎప్పుడూ కొత్త కొత్త  స్టైల్స్‌తో అభిమానులను కనువిందు చేస్తూ ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ధోని చేయించుకున్న ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ పేరేంటంటే.. ‘వీ హాక్‌’.

ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ధోని.. ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌‌ వద్ద ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. అనంతరం సెలూన్‌ నిర్వాహకులు ధోని ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఈ కొత్త లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో వారు ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

చదవండి: ధోని క్లీన్‌ షేవ్‌.. ఫ్యాన్స్‌ రియాక్షన్‌..!

ధోని బర్త్‌డే : పాండ్యా స్పెషల్‌ గిఫ్ట్‌ !

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top