ధోని క్లీన్‌ షేవ్‌.. ఫ్యాన్స్‌ రియాక్షన్‌..!

MS Dhoni Clean Shave Photo Viral In Social Media - Sakshi

ఇంగ్లండ్‌ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తెల్ల గడ్డంతో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్‌ అనంతరం ధోని క్లీన్‌ షేవ్‌తో ఉన్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. భారత స్పీనర్ అక్షర్‌ పటేల్‌ ధోనితో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశాడు. కానీ, ధోని తెల్లగడ్డం మాత్రం అభిమానులకు అంతగా నచ్చలేదని చెప్పవచ్చు. ఈ విషయంపై క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ధోని గడ్డంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక తెల్లగడ్డాన్ని తొలగించండి  అని ఇటీవల సలహా ఇచ్చాడు గౌతమ్‌. 

టీ20, వన్డే సిరీస్‌ తర్వాత ధోని ఇండియాకు చేరుకున్నాడు. గతంలోనే ధోని టెస్టులకు రిటైర్మెంట్‌ ఇచ్చిన విషయం విదితమే. సెలక్షన్‌ కమిషన్‌ ఎంపిక చేసిన టెస్టు జట్టులో అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌లకు స్థానం దక్కకపోవడంతో వారు కూడా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లు ధోనితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలో ధోని క్లీన్‌ షేవ్‌తో ఉన్నాడు. దీంతో అభిమానులు సంతోషంతో తెల్లగడ్డం తీసేశాడని కామెంట్స్‌ పెడుతున్నారు. గుడ్‌ లుక్‌.. నైస్‌ ఫోటో అని ఫ్యాన్స్‌ ఫొటోపై స్పందించారు. ఇటీవల ధోనికి సంబంధించిన రిటైర్మెంట్‌ ఊహగానాలకు తెరదీస్తూ  ఓ వీడియో సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top