వైరల్‌: ధోని ట్రైనింగ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్

MS Dhoni Practice Session With His Dogs - Sakshi

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తన కూతురు జీవాతో జరిగే సరదా సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇంటి ఆవరణలో తన పెంపుడు కుక్కలకు క్యాచ్‌ ప్రాక్టీస్‌ చేపించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నా పెట్‌ డాగ్స్‌తో గడిపిన క్షణాలు వెలకట్టలేనివి. వాటికి ట్రైనింగ్‌ ఇవ్వడం, క్యాచ్‌ ప్రాక్టీస్‌ చేపించడం చాలా అనందంగా ఉంది’ అంటూ ధోని పేర్కొన్నాడు.

కొద్ది రోజుల క్రితం తన కూతురు జీవాతో జరిగిన సరదా సన్నివేశాన్ని వీడియో తీసి పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది. ఈ వీడియోలో జీవా ఆడుకుంటూ ఉండగా ధోని భార్య సాక్షి "జీవా.. నాన్న మంచోడా చెడ్డోడా? అని అడగ్గా.. మంచోడు(గుడ్‌) అని బదులిచ్చింది. ఆ తర్వాత మీరందరూ మంచివారు. మీ అందరూ (బిగ్గరగా)" అని జీవా బదులిచ్చింది. ఇక టెస్టులకు గుడ్‌బై చెప్పిన జార్ఖండ్‌ డైనమెట్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ అనంతరం ఖాళీ సమయం దొరకడంతో కుంటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.

Very smart

A post shared by M S Dhoni (@mahi7781) on

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top