'ధోని ఐదేళ్లుగా పన్ను కట్టలేదు' | MS Dhoni has not paid tax for his 'Hummer' vehicle for last 5 years | Sakshi
Sakshi News home page

'ధోని ఐదేళ్లుగా పన్ను కట్టలేదు'

Mar 17 2016 2:53 PM | Updated on Sep 3 2017 7:59 PM

'ధోని ఐదేళ్లుగా పన్ను కట్టలేదు'

'ధోని ఐదేళ్లుగా పన్ను కట్టలేదు'

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన హమ్మర్ కారుకు ఐదేళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదని రాంచి డీటీఓ తెలిపారు.

రాంచి: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన హమ్మర్ కారుకు ఐదేళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదని రాంచి డీటీఓ తెలిపారు. పెనాల్టీతో సహా అతడు ఒకేసారి పన్ను చెల్లించాల్సివుంటుందని చెప్పారు. ధోని హమ్మర్ కు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు నమోదు కాలేదని తెలిపారు.

'మిస్టర్ కూల్' కారు పేరును టైపిస్ట్ పొరపాటున స్కార్పియోగా నమోదు చేశాడని వెల్లడించారు. హమ్మర్ అనేది అంతర్జాతీయ బ్రాండ్ అని అతడికి తెలియకపోవడంతో పొరపాటు పడ్డాడని వివరించారు. టైపిస్ట్ పొరపాటు పడడంతో ధోని హమ్మర్ వివరాలు లేవని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement