ధోని విఫలమైనా.. | MS Dhoni fails on return to domestic cricket but Jharkhand beat J&K by 9 runs in Vijay Hazare | Sakshi
Sakshi News home page

ధోని విఫలమైనా..

Dec 10 2015 7:43 PM | Updated on Sep 3 2017 1:47 PM

ధోని విఫలమైనా..

ధోని విఫలమైనా..

ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సొంత జట్టు జార్ఖండ్ తరపున తొలిమ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యాడు.

ఆలూరు(కర్ణాటక): ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సొంత జట్టు జార్ఖండ్ తరపున తొలిమ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యాడు.  విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఇక్కడ గురువారం జమ్మూ కశ్మీర్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 24 బంతులను ఎదుర్కొన్న ధోని తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ జార్ఖండ్ 9 పరుగులతో విజయం సాధించి టోర్నీలో బోణి చేసింది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50.0 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాత బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జార్ఖండ్ ఆటగాళ్లలో ఇషాంక్ జగ్గీ(54), కౌశల్ సింగ్(53)లు బ్యాటింగ్ లో ఆకట్టుకోగా, బౌలింగ్ లో వసీం రాజాకు మూడు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement