
కారణం ధోని బిజినెస్ భాగస్వామి, మాజీ క్రికెటర్ అరుణ్ పాండే..
హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్‌డే సందర్భంగా ఓ వైపు అతనికి సోషల్ మీడియా వేదికగా విషెస్ పోటెత్తుతుంటే.. కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, నటి అనుష్కశర్మపై మాత్రం ట్రోల్ జరుగుతోంది. దీనికి కారణం ధోని బిజినెస్ భాగస్వామి, మాజీ క్రికెటర్ అరుణ్ పాండే షేర్ చేసిన ఫొటోనే. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు.
అనుష్క శర్మ సైతం అక్కడే ఉండటంతో ధోని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. అయితే అరుణ్ పాండే షేర్ చేసిన ఫొటోలో ధోని అతనికి కేకు తినిపిస్తుండగా.. పక్కన ఉన్న అనుష్కశర్మ సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చూస్తున్నట్లుంది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోకు సరదాగా క్యాప్షన్‌లిస్తున్నారు. అనుష్కా కోపమెందుకు..? ఎందుకు సీరియస్‌గా ఉన్నావు? ఓహో.. ముందుగా కేక్ కోహ్లికి తినిపించలేదనా? అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో, ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Anushka's face reaction😹😹😹
— RAINA'S Preetha (@PreethaRaina3) July 7, 2018
Guys just see the reactions of #AnushkaSharma on MSD's birthday celebration@imVkohli @msdhoni @CricketFusion @ICC @aajtak @abpnewstv 😂😂😂😂😂 pic.twitter.com/aIjT9nXaL5
— Ashish Kr. (@Ashishkr0511) July 7, 2018