ఇంగ్లండ్‌కు ఆమిర్‌ మకాం!

Mohammad Amir Planning To Settle Down in UK - Sakshi

కరాచీ: రెండు రోజుల క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌.. ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ క్రికెట్‌లో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉన్న ఆమిర్‌ తన కెరీర్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుతో కొనసాగించాలనే యోచనలో ఉన్నాడట. ఆ క్రమంలోనే ముందుగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి షాకిచ్చాడు. దాంతో ఆమిర్‌పై పాక్‌ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కే గుడ్‌ బై చెప్పి పాక్‌ క్రికెట్‌ను మరింత కష్టాల్లోకి నెట్టావంటూ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శించాడు. అసలు నీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ ఆడకుండా చేయాలంటూ మండిపడ్డాడు.

ఇదిలా ఉంచితే, మొత్తంగా దేశమే మారిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆమిర్‌ ఉన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటీష్‌ పౌరసత్వం కల్గిన నర్గీస్‌ మాలిక్‌ను ఆమిర్‌ మూడేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో అతనికి ఇంగ్లండ్‌లో సెటిల్‌ కావడానికి అవకాశం ఉంది. భార్య వీసా మీద ఆమిర్‌ ఇంగ్లండ్‌లో స్థిరపడే అవకాశం ఉన్నందను ఇప్పుడు ఆ ప్లానింగ్‌లోనే ఉన్నాడట.  అక్కడే ఇల్లు కొనడానికి ఆమిర్‌ సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా తన క్రికెట్‌ కెరీర్‌ ఎంతో నేపథ్యంలో దాన్ని ఇంగ్లండ్‌ తరఫున పరీక్షించుకోవాలనేది ఆమిర్‌ ప్రధాన ఉద్దేశంగా కనబడుతోందనేది వార్తల సారాంశం.

ప్రస్తుతం ఇంగ్లండ్‌ ప్రధాన జట్టును పరిశీలిస్తే స్వదేశీ క్రికెటర్ల కంటే విదేశీ క్రికెటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లండ్‌ వన్డే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(ఐర్లాండ్‌), బెన్‌ స్టోక్స్(న్యూజిలాండ్‌)‌, జోఫ్రా ఆర్చర్‌(వెస్టిండీస్‌)తదితరులు ఇలా ఇంగ్లండ్‌కు దిగుమతి అయినవారే. ఇప్పటికే పాకిస్తాన్‌ తరఫున తానేంటో నిరూపించుకున్న ఆమిర్‌.. ఇంగ్లండ్‌ జట్టు తరఫున ఆడటం ఏ మాత్రం​ కష్టం కాదు. దాంతోనే తన ఇంగ్లండ్‌ మకాం ప్రణాళికల్లో ఆమిర్‌ ఉన్నట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. (ఇక్కడ చదవండి: మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top